హమ్మయ్య అనుకుంటున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. ఎన్నో అడ్డంకులు, మరెన్నో ఆటంకాలు, అవరోధాలు…ఇన్నీ అన్నీ కావు. లెక్కలేనన్ని ఇబ్బందులు అన్నిటినీ తట్టుకుని హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజు డేట్‌ను చేజిక్కించుకుంది. రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని అంతర్గతమైన సమస్యల కారణంగా వీరమల్లు థియేటర్లను చేరుకోలేకపోయింది. నిర్మాత ఎఎం రత్నం చీఈ నిలకడైన మనిషి, గట్టి గుండెకాయ గల సమర్ధుడు కాబట్టి నిలదొక్కుకున్నాడు కానీ మరొకడు మరొకడైతే గనక నా సామి రంగా….. అడ్రస్‌లే గల్లంతైపోయుండేది.
ఇది చూస్తేనేమో మొదటిసారి పవర్‌స్టార్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో చేసిన సినిమా. పైగా పాన్ ఇండియా. అంటే స్టేక్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. కథ చూస్తేనేమో ఓ సామాన్యుడు మొగల్ పాదుషాతో తలపడి, సామాజిక న్యాయం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఫైట్ చేసే కథో తయారవుతోంది. సనాతన ధర్మం బేస్ ఇందులో ఇమిడి ఉండడం కూడా ఇందులో మరో హైలైట్. పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం ఈ సనాతన ధర్మం అనే టాపిక్ ఆవిరులెత్తిస్తోంది. హిందూవాదులు, సనాతనధర్మ ఉపాసకులు ప్రాణాలను తృణీకరించైనా సరే హిందూ వాద, పురాణకాల సంవిధానాన్ని పునరుద్ధరించడానికి గట్టిగా నడుం కట్టి కదను తొక్కుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఇటీవల తాజాగా రాజకీయరంగలో పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ రేట్‌ను సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పిన గ్లామర్ ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ దట్టంగా వ్యాపించింది. ఎవరికైనా సినిమా గ్లామర్‌తో రాజకీయాలలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తే, పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సాధించిన విజయంతో తన సినిమాకి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టారు. సాక్షాత్తూ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీయే పవన్ కళ్యాణ్‌ని ఆందీ హై ఆందీ అని సంబోధించడం, అభివర్ణించడంతో పవన్ కళ్యాన్‌కి ఉత్తరాదిలో తిరుగులేని ఇమేజ్ వచ్చేసింది. పవన్ అంటే తుఫాన్ అని నరేంద్రమోడీయే అంటుంటే ఏ వ్యక్తికైనా అనూహ్యమైన ఇమేజ్ ఏర్పడుతుంది. అందుకే పవన్ మీద విపరీతమైన ఆరా తీశారు ఉత్తరాదివారు. మిగిలిన భాషా రాష్ట్రాలవారు కూడా పవన్ అంటే విపరీతమైన మోజు ఏర్పరుచుకున్నారు. ఆయన సనాతనవాది అని తెలుసుకున్నారు. ఇటు రాజకీయపరమైన ఉధృతమైన విజయం, మరోవైపు సనాతనధర్మ పరిరక్షకుడిగా విస్తృతమైన పాప్యులారిటీ పనవ్కి ఓ నటుడిగా విపరీతమైన మైలేజ్‌ని మోసుకొచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంగా హరిహరవీరమల్లుకి సూపర్ డూపర్ హిట్ టాక్ని కట్టబెడుతున్నాయి.
మరో ముఖ్యమైన విశేషం, జూలై 24 తర్వాత అంతగా చెప్పుకోదగ్గ భారీ చిత్రాల సందడి ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఫ్రీ జోన్ అనమాట. పండగల్లో శెలవులు వచ్చినట్టు అనమాట. కంప్లీట్‌గా ఓపెన్ స్పేస్ ఎంజాయ్ చేయబోతోంది హరిహరవీరమల్లు.
తెనాలి రామలింగడు ప్లస్ రాబిన్ హుడ్ కాంబో
హరిహర వీరమల్లు అనే ఎపిక్ డ్రామాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ఈ ఉద్యమకారుడి పాత్రకి మస్తు షేడ్స్ భలేగా కుదిరాయి. పవన్ కళ్యాణ్ అంటేనే ఎంటర్ టైన్మెంట్ ప్లస్ యాక్షన్ ప్లస్ రొమాన్స్ అండ్ మ్యూజిక్ కాంబినేషన్. పవన్ హిట్ అయిన ఏ సినిమా చూసినా కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంగిల్స్ అన్నీ సమపాళ్ళలో మేళవించిన సినిమాయే హరిహర వీరమల్లు కావడం ఈ చిత్రంలో ప్రధానమైన ఆకర్షణ. పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ఈ క్యారెక్టర్లో ఓ పక్కన వినోదాన్ని పండించడానికి తెనాలి రామలింగడు పాత్రలా కనిపిస్తుంది. మరోవైపు సామాన్యజనాన్ని ఆదుకునే రాబిన్ హుడ్ పాత్రగా కూడా కనిపిస్తుంది. మరోవైపు మొగల్ సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించి, హిందూధర్మ సాధకుడిగా వీరోచితమైన యాక్షన్ పార్ట్…..ఇంతకన్నా ఏం కావాలి? పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇన్ని ప్లస్ పాయంట్స్ ఉన్నప్పుడు హరిహరవీరమల్లు చిత్రం ఢోకాలేని సక్సెస్‌ని సాధిస్తుందనే వార్త దావానంలా అలుముకుంది. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ కాంబినేషన్ ఒక ఆటంబాంబులా వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఆల్రెడీ ఉన్న పవర్ స్టార్ ఇమేజ్ అండగా ఉండగా, ఆయన సినిమా లేక చాలా సంవత్సరాలైపోయింది. జూలై 24న రావడానికి సిద్ధమవుతున్న హరిహరవీరమల్లు ఆయన అభిమానుల్లో కేక పుట్టిస్తోంది. ఉత్తరాదిన అంటారా…..పవన్ కళ్యాణ్ అంటే ఆందీ అంటే తుఫాన్ అనే ఇమేజ్ రాజ్యమేలుతోంది. దానాదీనా హరిహరవీరమల్లు డెఫినెట్ బ్లాక్‌బస్టర్ అనేదే అన్ని చోట్లా ఢంకా బజాయిస్తోంది.