»Rumors Spread On Hari Hara Veera Mallu Movie Release Date
వీరమల్లుని మోసేస్తున్నారు
ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడిన దరిమిలా, అమెజాన్ ఓటిటి సంస్థ కాస్త ఇప్పటికే చాలా వరకూ ఇచ్చే డబ్బులో కట్ చేసుకుంటూ వచ్చిందని వినికిడి. కాగా, ప్రమోషన్లకి కూడా ఏ మాత్రం అవకాశం లేని రద్ధీలో సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైపోయింది. ఒకసారి చూసుకుని, సినిమాలో ఏవైనా లోపాలుంటే గనక వాటిని ఎలా సరిదిద్దుకోవాలీ అనే సమీక్షకి కూడా ఊపిరాడని వ్యవహారంలో వీరమల్లు సినిమా ధియేటర్లలోకి దూసుకు వచ్చేస్తోంది.
హరిహరీ….దారుణం. వీరమల్లు సినిమాని సోషల్ మీడియాలో కిట్టనివాళ్లు దారుణంగా మోసేస్తున్నారు. అప్పుడే నెలరోజుల బట్టి, ఎప్పుడైతే సినిమా రిలీజుకి దగ్గరవుతున్నదని తెలిసిపోయిందో ఆ క్షణమే అల్లరిమూకలు దాడికి దిగబడిపోయారు. సినిమా బాగా రాలేదని, కీరవాణి పాటలు నీచంగా ఉన్నాయని, ఇద్దరు డైరెక్టర్లు మారి, సినిమాని ఖూనీ చేసేశారని, అడ్డూ ఆపూ లేకుండా రెచ్చిపోతున్నారు. ఇదంతా ఏదో మనం స్వంతంగా కల్పించి రాస్తున్నది కానేకాదు. స్వయంగా నిర్మాత ఎఎం రత్నమే సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారట. ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడిన దరిమిలా, అమెజాన్ ఓటిటి సంస్థ కాస్త ఇప్పటికే చాలా వరకూ ఇచ్చే డబ్బులో కట్ చేసుకుంటూ వచ్చిందని వినికిడి. కాగా, ప్రమోషన్లకి కూడా ఏ మాత్రం అవకాశం లేని రద్ధీలో సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైపోయింది. ఒకసారి చూసుకుని, సినిమాలో ఏవైనా లోపాలుంటే గనక వాటిని ఎలా సరిదిద్దుకోవాలీ అనే సమీక్షకి కూడా ఊపిరాడని వ్యవహారంలో వీరమల్లు సినిమా ధియేటర్లలోకి దూసుకు వచ్చేస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ అనే హీరో ఒక వైల్డ్ ఫైర్ అన్నది ఎవ్వరికీ కొత్తగా చెప్పనక్కర్లేదు. పైగా ఆయనకున్న వీరాభిమానుల వీరావేశంతో పాటుగా జనరల్ ఆడియన్స్ కూడా ఆయన సినిమా చాలా కాలంగా చూడక వెర్రెక్కి ఉన్నారన్నది తిరుగేలేని నిజం. దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా పవర్స్టారేనని ఆయనకు ఆయనే స్వయంగా 21కి 21 సీట్లూ గెలుచుకుని మొత్తం భారత దేశమంతా కూడా పెను సంచలనం సృష్టించారు. దాంతో ఆయనకి డబుల్ ఛరిస్మా వర్కవుట్ అవుతోందిప్పుడు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోనూ కూడా పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన మోజు వచ్చేసింది. అలాంటిది ఆయన సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మొదటిసారి సందడి చేయబోతోందంటే మామూలు విషయం కాదని మొన్నొక బిగ్ ప్రొడ్యూసరే వ్యాఖ్యానించారు. ఒకరు చెప్పనక్కర్లేదు. ఇది అందరికీ తేటతెల్లంగా తెలిసిన విషయమే.
అలాంటి సినిమాని నిర్మాత రత్నం ఎనలేని వ్యయప్రయాసలకోర్చి నిర్మించారు. ఎక్కడా ఏ రకమైన సహాయం లేకుండా ఒక్కడే అన్నిటికీ నిలబడి సినిమాని ఫినిష్ చేశారు. మధ్యలో మొదటి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మధ్యలో తప్పుకుంటే తన కొడుకు చేతికి మైక్రోఫోన్ అప్పగించి అత్యంత ధైర్యసాహసాలతో వీరమల్లుని పూర్తి చేయడం నిజంగానే ఆయన అనుభవానికి ఒక మచ్చుతునకగానే చెప్పాలి. వీరమల్లు సినిమా నిర్మాణం వెనుక ఎన్ని అగాధాలున్నాయో, వాటిని ఎలా దాటుకుంటూ వచ్చారో ఒక్క రత్నంకి మాత్రమే తెలుసు.
ప్రత్యర్ధులకి ఇవేవీ పట్టవు. అక్కర్లేదు. ఒకటే మోత. ఇప్పుడు కొత్తగా వీరమల్లు డిస్క్ పోయింది, ఆ కారణంగా వీరమల్లు డేట్ తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన పేరు మీద ఓ ఫేక్ అక్కౌంట్ క్రియేట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసి పారేశారు. దెబ్బకి ట్రేడ్‌కి దిమ్మ తిరిగిపోయింది. అభిమానుల గుండె చెరువయిపోయిన సందర్భం ఇది. అభిమానులు ఒకెత్తు అయితే స్వయంగా ఇన్ని కష్టనష్టాలకు ఓర్చుకుని సినిమాని ఈ దశ వరకూ మోసుకొచ్చిన నిర్మాత రత్నంకి ఎంత అశనిపాతంగా ఉంటుందో మాటల్లో చెప్పనే చెప్పలేం. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశ్రమలోని రత్నం శ్రేయోభిలాషులు ఆత్మీయులు పెద్ద కసరత్తే చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ చిత్రాలకిది కొత్త కాదు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా టైంలో కూడా కొంత ఫుటేజ్ వాట్సాప్‌లో తెగ తిరిగేసింది. అయినా ఆ వికృత చేష్టలు సినిమా విజయాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోగా, సినిమా క్రేజ్‌ని పెంచడానికి ఖర్చుతో నిమిత్తం లేకుండా గొప్పగా ఉపయోగపడింది. ఇప్పుడీ మోత కార్యక్రమం కూడా హరిహరవీరమల్లు చిత్రానికి కూడా అంతే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు.