MNCL: ఆర్టీసీ బస్సులలో మగవారిపై ప్రభుత్వం ఆర్థిక భారం వేయడం సరికాదని బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ తెలిపారు. శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించి, జన్నారం నుండి మంచిర్యాలకు రూ. 80 ఉండగా రూ.100కి పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని అన్నారు.