అరవింద్‌కీ బన్నీవాసుకి చెడిపోయిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అరవింద్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తున్నారని, దాని వల్ల సంస్ధకి చేద్దామనుకుంటున్న హీరోలు మరో సంస్థకి మళ్ళిపోతున్నారనే ఆవేదన బన్నీవాసుని ఆవేదనకి గురి చేస్తున్నాయని, అందుకే తను వేరే నిర్మాణ సంస్థను ప్రారంభించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతున్నాడని, అందుకు అల్లు అర్జున్ మద్దతు కూడా లభించిందని అనుకుంటున్నారు.
ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ప్రముఖ నిర్మాత బన్నీవాసు ఈ మధ్యన వార్తల్లోకి బాగానే ఎక్కుతున్నారు. అదే విచిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులూచేర్పులను పసిగట్టడం ఎవరి తరం కావడం లేదు. అందులో ప్రధానంగా గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రాణభాగంగా కొనసాగుతున్న బన్నీవాసు హటాత్తుగా వేరే కుంపటికి ప్రయత్నం చేస్తున్నారని వార్తలు రావడం, వాటిని బన్నీవాసు ఖండించకపోవడం చూసి చాలా మంది కనుబొమ్మలు ఎగరేశారు. ఇదో పెద్ద గాలి దుమారంలా ప్రతీ ప్రొడక్షన్ ఆఫీసలోనూ పెద్ద చర్చగా మారింది. అరవింద్‌కీ బన్నీవాసుకి చెడిపోయిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అరవింద్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తున్నారని, దాని వల్ల సంస్ధకి చేద్దామనుకుంటున్న హీరోలు మరో సంస్థకి మళ్ళిపోతున్నారనే ఆవేదన బన్నీవాసుని ఆవేదనకి గురి చేస్తున్నాయని, అందుకే తను వేరే నిర్మాణ సంస్థను ప్రారంభించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతున్నాడని, అందుకు అల్లు అర్జున్ మద్దతు కూడా లభించిందని అనుకుంటున్నారు. వాసు పేరు బన్నీవాసుగా మారడానికి అసలు కారణం ముఖ్యంగా వాసు అనే వ్యక్తి అల్లు అర్జున్‌కి అత్యంత సన్నిహితుడు కావడమేనన్న వాస్తవం చాలామందికి తెలిసినదే.
మరి అరవింద్‌తో తెగతెంపులు చేసుకున్న వాసుని అల్లు అర్జున్ ఎందుకు సపోర్ట్ చేసినట్టు అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. అంటే మెగా కుటుంబానికి అల్లువారి కుటుంబానికి సంబంధించి నడుమ వచ్చిన పగుళ్లు అల్లు అర్జున్‌కీ, అల్లు అరవింద్ మధ్యన కూడా తేడాలొచ్చినట్టు చేసిందనేది మరో విశ్లేషణ. మెగా కుటుంబం పట్ల అల్లు అర్జున్ ప్రదర్శించిన వైఖరి బొత్తిగా అల్లు అరవింద్‌కి నచ్చలేదని కూడా వినిపిస్తోంది. కానీ విధి చాలా బలీయమైనదనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.
ఇటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుండగా, మరో వైపు తాజాగా బన్నీవాసు తన ఎక్స్ హేండిల్ ద్వారా చేసిన ట్వీట్ మరో సంచలనానికి దారి తీసింది. ఈ రోజు ఉదయమే బన్నీవాసు ట్వీట్ చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. అందులో ఎగ్జిబిటర్లని, డిస్ట్రిబ్యూటర్లని ఉద్దేశించి ధియేటర్లకి ఆడియన్స్‌ని రప్పించి, తద్వారా ఫుట్‌ఫాల్స్ పెంచుకునే ప్రయత్నం చేయడం మానేసి నీకు పావలా, నాకు పావలా అనే రొచ్చు రచ్చకి దిగిపోతున్నారు అందరూ అనే బన్ని వాసు ట్వీట్ చేశారు. అయితే ఇది ఏ ఓక్కరి తప్పో కాదు. ఇటువంటి దారుణమైన పరిస్థితి నెలకొనడానికి హీరోలు కూడా ప్రత్యేకమైన కారణమేనని బన్నీవాసు అభిప్రాయంగా వ్యక్తం చేశారు. మూడేళ్ళకీ, నాలుగేళ్ళకీ ఒక సినిమా చేయడానికి అలవాటు పడిపోయిన హీరోలు కూడా ఈ అంశాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలని బన్నీ వ్యక్తం చేశారు. మరి అలా చేస్తున్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు కదా! మరి ఆ విషయాన్ని ఎందుకు బన్నీవాసు గుర్తుపెట్టుకోలేదు. లేదా అల్లు అర్జున్‌కి నేరుగా, ప్రత్యక్షంగా చెప్పలేక ఈ రోజు ట్వీట్ రూపంలో బన్నీవాసు ఇలా చేశారా అనే కొత్త చర్చకు తెరలేచింది.
లేదా అల్లు అర్జున్‌కి బన్నీవాసుకీ కూడా చెడిపోయిందా అనే అనుమానాలు కూడా రాకపోలేదు. లేదా ఇంత బాహాటంగా ఎందుకు బన్నీవాసు బైటపడతారు అనే ప్రశ్నని అంత తేలిగ్గా తీసిపారేయలేం.