ELR: వర్జీనియా పొగాకు ధర రూ.300కు చేరింది. జంగారెడ్డిగూడెంలోని 1, 2 వేలం కేంద్రాల్లో శనివారం ఈ ధర పలికింది. ఈ సీజన్లో రూ. 290 గరిష్ఠ ధరతో కొనుగోళ్లు ప్రారంభించిన కంపెనీలు ఈ వారంలో క్రమంగా రూ.10 మేర పెంచాయి. ఈ పెరుగుదల మరింత ఉండాలని పొగాకు రైతులు ఆకాంక్షిస్తున్నారు. రోజూ 1000 నుంచి 1100 బేళ్లు వేలానికి వస్తున్నాయి.