KNR: వెనుకబడిన తరగతుల శాఖ HYD ఆధ్వర్యంలో జిల్లాలోని MBC నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాల కోసం HYDలో 4రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు BC అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు. శిక్షణా సమయంలో ప్రయాణం, భోజన, ఉచిత వసతి ఉంటుందన్నారు. ఏదైనా డిగ్రీ, 30 సంవత్సరాలలోపు వారు అర్హులని, ఆసక్తి గలవారు జులై 12లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.