TG: గోవా నుంచి అక్రమంగా కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కృష్ణా నగర్‌కు చెందిన సయ్యద్ అజర్ హస్మీ అనే యువకుడు షార్ట్ ఫిలిం ఫొటో గ్రాఫర్‌గా పని చేసేవాడు. బంజారాహిల్స్‌కు చెందిన క్రాంతి అనే వ్యక్తితో కలిసి గురువారం మ.2 గం.లకు జూబ్లీహిల్స్‌లో విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
KNR: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న మహి(7) అనే చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో మిల్క్ వ్యాన్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలో మృతి చెందింది. పాప తండ్రి మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్క్ వ్యాన్ డ్రైవర్‌పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
NGKL: అమ్రాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం అమ్రాబాద్ ప్రధాన రహదారిపై ఇవాళ అదుపుతప్పి పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం నెలకొంది. ఘటనకు సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
RR: గండిపేట చౌరస్తా వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డివైడర్ మధ్యలో కరెంట్ ఫోల్ రోడ్డు అడ్డంగా పడిపోయింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ స్థంబాన్ని తొలగించారు.
NZB: ట్రాలీ ఆటో ఢీకొని యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మల్కాపూర్ గండి వద్ద చోటుచేసుకుంది. మల్కాపూర్‌కు చెందిన యువకుడు గురువారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా మల్కాపూర్ గండి వద్ద ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటో రోడ్డుకిందకు దూసుకెళ్లింది.
కృష్ణా: కుటుంబ కలహాల నేపథ్యంలో మచిలీపట్నంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజుపేటకు చెందిన కేశన జాను(21) ముఠా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది వివాహం జరగ్గా, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి హాస్పిటల్‌కు తరలించారు.
NRPT: నారాయణపేట మండలం బొమ్మను పాడు గ్రామంలో గురువారం గొల్ల పెంటప్ప అనే వ్యక్తి వరి గడ్డివాము ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తున్న క్రమంలో పైన వున్న విద్యుత్ తీగలు తగిలి గడ్డి వాముకు నిప్పు అంటుకుంది. గమనించిన రైతు ట్రాక్టర్ ఇంజన్‌ను వేరు చేశాడు. అనంతరం ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డి మొత్తం కాలి బూడిద అయింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాజ్నీ ప్రావిన్స్‌లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 52 మంది మృతి చెందగా.. మరో 65 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలోని జాతీయ రహదారి వద్ద గురువారం అప్పుల బాధ తాళలేక గురువారం మోహన్ బాబు(23) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజోలి మండలం నరసనూరు గ్రామానికి చెందినవాడు కాగా.. మండల కేంద్రమైన అయిజలో రెడీమేడ్ షాపును నిర్వహిస్తున్నాడు. దీనిపై మానవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడారం సమీపంలో గురువారం ఉదయం బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చంద్రపూర్ నుంచి పాల్వంచకు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
KMM: మణుగూరు సింగరేణి ఏరియా ఓసీ-2లో గురువారం ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. డంపర్ బోల్తా పడటంతో మూన్ చందా అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు డంపర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని సింగరేణి అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వియత్నాం రాజధాని హనోయిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బార్‌లో గొడవపడ్డాడు. అనంతరం బటెక్‌తో పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. పక్కనే బైక్‌లు, ఇతర వాహనాలు నిలిపి ఉంచడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసే ప్రయత్నాలను చేస్తున్నారు.
KNL: అస్పరి (మ) జోహారాపురంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడినట్లు ట్రైని DSP ఉషశ్రీ తెలిపారు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా, ముత్తుకూరులోని తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.