• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

చెట్టును ఢీకొన్న ఆటో.. నలుగురికి గాయాలు

MDK: ఆందోల్ మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు డాకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 11, 2024 / 02:32 PM IST

ఆగిరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

కృష్ణా: నూజివీడులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం ఆగిరిపల్లి వైపు నుంచి దోస్త్ ట్రక్ వాహనంపై తీసుకువెళుతున్న ప్లాస్టిక్ వాటర్ డ్రమ్ గాలికి ఎగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిపై పడింది. దీంతో వాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన రాయిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది.

December 11, 2024 / 02:29 PM IST

వాహన ప్రమాదంలో నీలుగాయి మృతి

NRML: వాహన ప్రమాదంలో నీలుగాయి మృతి చెందిన ఘటన బుధవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీనా వివరాల మేరకు కుంటాల మండలం కల్లూరు నుండి నిర్మల్‌కు ప్రయాణిస్తున్న ఓ కారు లోలం-సిర్గాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న నీలుగాయిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ వైద్యుడికి సమాచారం అందించామన్నారు.

December 11, 2024 / 02:28 PM IST

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

SRPT: గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధమయిన ఘటన పెన్ పహాడ్ మండలం జంగాల కాలనీలో చోటుచేసుకుంది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చాయి.

December 11, 2024 / 01:45 PM IST

బైక్‌ను ఢీకొని కారు బోల్తా.. ఒకరు మృతి

NZB: బోధన్‌ మండలంలోని సాలూర క్యాంప్‌ వద్ద బుధవారం ఉదయం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కారు సాలూరా క్యాంప్‌ వద్ద అదుపు తప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం మరో బైక్‌ను ఢీకొని రోడ్డు కిందకి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న అయూబ్‌ మృతి చెందాడు.

December 11, 2024 / 01:43 PM IST

కలువాయిలో యువకుడు దారుణ హత్య

NLR: కలువాయి మండలం పర్లకొండలో పంట పొలాల్లో మంగళవారం రాత్రి కొల్లూరు గోపి (27) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపినట్లు తెలుస్తోంది. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి హత్య గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

December 11, 2024 / 12:40 PM IST

ఆటో బోల్తా.. కూలీలకు తీవ్ర గాయాలు

ATP: పుట్లూరు మండల పరిధిలోని గోపురాజపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటో బోల్తా పడటంతో గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. ఎల్లనూరు మండలంలోని నిట్టూరు గ్రామానికి పొలం పనులకు వెళ్తుండగా గిర్రమ్మ బావి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.

December 11, 2024 / 11:51 AM IST

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, తండ్రికి గాయాలు

కడప: మైదుకూరు మండలం గడ్డంవారిపల్లె వద్ద బుధవారం ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణపురంకు చెందిన వినోద్ కుమార్ రెడ్డి అనే యువకుడు మృతిచెందారు. మృతుని తండ్రి వెంకటరమణారెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

December 11, 2024 / 10:40 AM IST

రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద మంగళవారం రాత్రి ఆగి ఉన్న ఆర్మీ కంటైనర్ లారీని బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొన్న నేపథ్యంలో బుధవారం మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి ఆయన క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. బియ్యం యజమాని దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

December 11, 2024 / 10:06 AM IST

బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌..!

బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘స్త్రీ 2’ మూవీ నటుడు ముష్తాక్‌ ఖాన్‌ను ఇటీవల కొంతమంది దుండగులు కిడ్నాప్‌ చేశారట. ఢిల్లీ-మీరఠ్‌ హైవేపై 12 గంటల పాటు ఆయనను భయభ్రాంతులకు గురిచేసినట్లు తాజాగా ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.

December 11, 2024 / 09:34 AM IST

ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

AP: పేలుడు పదార్థాలతో ఆగి ఉన్న ఆర్మీ వాహనాన్ని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. వెంటనే లారీకి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామ సమీపంలో హైవేపై చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి ఆర్మీకి సంబంధించిన పేలుడు పదార్థాలతో 18 కంటైనర్లు చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

December 11, 2024 / 09:14 AM IST

అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తి అరెస్టు

VZM: అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని వేపాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆకుల సీతంపేటలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఎస్సై బి. దేవి తెలిపారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుండి 5180 మిల్లీలీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

December 11, 2024 / 08:13 AM IST

బాంబు దాడుల్లో వందలాది మంది మృతి!

సూడాన్‌లో బాంబు దాడుల ఘటనల్లో వందలాది మంది మరణించినట్లు మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు వేసిన బారెల్‌ బాంబులు, షెల్లింగ్ కారణంగా గత రెండు రోజుల్లోనే దాదాపు 127 మంది చనిపోయినట్లు తెలిపారు. 20 నెలలుగా ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌(RSF) మధ్య కొనసాగుతున్న ఆధిపత్య యుద్ధంలో సాధారణ ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   

December 11, 2024 / 08:01 AM IST

చెరువులో పడి మతిస్తిమితం లేని యువతి మృతి

W.G: దెందులూరు మండలం మలక చర్ల పరిధిలోని చెరువులో పడి రామారావు గూడెం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఆశాజ్యోతి అనే మహిళ మృతి చెందిందని దెందులూరు ఎస్ఐ శివాజీ తెలిపారు. రామారావు గూడెం గ్రామానికి చెందిన మృతురాలు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటినుంచి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం సాయంత్రం మలకచర్ల పరిధిలోని చెరువులో మృతదేహాన్ని గుర్తించారు.

December 11, 2024 / 08:01 AM IST

భార్య కాపురానికి రావటం లేదని భర్త ఆత్మహత్య

NTR: మండల కేంద్రమైన ఏ.కొండూరు గ్రామానికి చెందిన కలవకట్లు నవీన్ అనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నవీన్ భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 11, 2024 / 07:24 AM IST