AP: కృష్ణా జిల్లాలో విషాదం జరిగింది. క్రికెట్ ఆడుతుంగా ఓ యువకుడు గుండె పోటుతో మరణించాడు. అంగళూరు నుంచి కౌతారం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన కొమ్మలపాటి సాయి(26) బౌలింగ్ వేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే అతన్ని గుడివాడలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.