GNTR: నకరికల్లులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమలమర్రికి చెందిన తోక కొండయ్య(56) మృతి చెందారు. మృతుడు తన భార్యతో రోడ్డు దాటుతుండగా పిడుగురాళ్ల వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఓ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నియంత్రణ తప్పి కొండయ్య, ఆయన భార్యను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొండయ్య మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్రగాయాలు కావడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.