SDPT: చేర్యాల పట్టణ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న యువకులను రిమాండ్కు తరలించినట్లు చేర్యాల సీఐ శీను తెలిపారు. బుధవారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేర్యాల ఎస్ఐ నిరేశు వచ్చిన సమాచారంతో పట్టణ శివారులోని గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అమ్ముతున్నట్టు తెలిపారు.