E.G: రాజానగరం మండలం చక్రద్వారబంధంలో బుధవారం సాయంత్రం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమండ్రిలోని ఓ షోరూంలో ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశారు. ఈక్రమంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా సీటు కింద ఉన్న బ్యాటరీ నుంచి శబ్దం వచ్చింది. ఆగి చూసేసరికి ఒక్కసారిగా మంటలు ఎగసి క్షణాల్లోనే కాలిబూడిదైందని బాధితుడు వాపోయారు.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ స్థాయిలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డెలివరీ చేస్తున్న రెండు అనుమానిత వస్తువులను పట్టుకోగా.. మైనపు రూపంలో ఉన్న 12.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9.95 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు… ఆ విమానాశ్రయంలో పని చేస్తున్న ముగ్గురి వ్యక్తులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్...
ATP: విడపనకల్ మండలం కడదరబెంచి వద్ద ప్రమాదవశాత్తు కంకర క్వారీ మిషన్‌లో పడి బీహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ (19) అనే కూలి మృతి చెందాడు. క్వారీ మిషన్ ఆన్‌లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న తోటి కూలీలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
WNP: మోరిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన సాకలి వెంకటస్వామి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న మోరీలో పడి బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలపగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన చక్రినాయక్ బుధవారం రాయచోటి పెద్దబిడికిలో జరిగిన తన అన్నపెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా వద్ద పాలవ్యాను బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన...
KDP: నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి రోడ్డు రోలర్‌ను తీసుకువస్తున్న లారీ టేకూరుపేట సమీపంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు రోలర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఓ బాలికపై అత్యాచార కేసులో జైలుకెళ్లిన నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి.. బాధితురాలిని హత్య చేసిన వైనం ఒడిశాలో జరిగింది. కును కిశాన్ అనే వక్తి సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను ఆ బాలికను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. బాలిక అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం...
కాళీ మాత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటలుగా పూజల్లో నిమగ్నమైన పూజారి దేవత ప్రత్యక్షం కాలేదన్న మనస్తాపంతో పూజారి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. మంత్రి కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాలిబన్ మంత్రి ఖలీల్ ఉల్ రెహమాన్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఉల్ రెహమాన్ శరణార్థి శాఖను నిర్వహిస్తున్నారు.
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కారులో విష్ణు అనే వ్యక్తి ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ఘటనలో కారులోంచి ప్రేమ్ చంద్ అనే మరో వ్యక్తి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.
SRCL: మద్యం సేవించి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు ఇచ్చినట్టు DSP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2017 ఫిబ్రవరి 2న సిరిసిల్లలో గగులోతు హనుమంతు డ్రంక్ & డ్రైవ్ చేపడుతున్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని దుర్భాషలాదడినందుకు అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
HYD: నాంపల్లిలో భయానక వాతావరణం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం క్రిమినల్ కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న HP పెట్రోల్ బంకుకు పెట్రోల్‌తో వ్యాన్ వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వ్యాన్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డు మీదకు మళ్లించాడు . స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
HYD: నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్ఆర్ నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆదర్శ్, శ్రీకాంత్, అజయ్, సంజయ్ ఉంటున్నారు. మొదట డ్రగ్స్‌కి బానిసలై ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. గంగలూరు పరిధిలోని మూంగా ప్రాంతంలో ఐఈడీ పేలడంతో ఇద్దరు డీఆర్‌జీ సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
NRPT: మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ దగ్గర గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నారాయణపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే మరికల్ ఎస్సై రాముకు వివరాలు తెలపాలని కోరారు. మరింత సమాచారం కోసం మరికల్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712670408లో సంప్రదించాలని కోరారు.