KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసాని పేట్‌కు చెందిన అలీనా అనే విద్యార్థిని జాండీస్‌తో శుక్రవారం మృతి చెందింది. అలీనా కామారెడ్డి మైనార్టీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు తండ్రి రఫీక్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం విద్యార్థినికి జాండీస్ సోకడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు సమాచారం.
HYD: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండి మైసమ్మ చౌరస్తా సమీపంలో 70 ఏళ్ల వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: ఒంటిమిట్ట చెరువు కట్టపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు, కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన వీఎస్ ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి కారు చెరువు కట్ట పైకి రాగానే బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తమిళనాడులోని కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి భర్త చంపేశాడు. బ్యాగ్‌లో శరీర భాగాలు తీసుకెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. అనుమానంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో బ్యాగ్‌లో మటన్ తీసుకెళ్తున్నట్లు బుకాయించేందుకు ప్రయత్నించాడు. బ్యాగ్ లాక్కొని తెరిచి చూడగా మహిళ శరీర భాగాలు కనిపించాయి. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ...
NLG: మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందిన ప్రయాణికులు తెలిపారు. తెల్లవారుజామున ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లిందని చెప్పారు. ప్రమాదం జరిగాక డ్రైవర్ పరారయ్యారని తెలిపారు. కాగా ఆ బస్సు 55 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 10 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
SKLM: పలాస మండలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MHBD: కోతుల దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడ మండల సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో బైక్‌పై వెళ్తుండగా మహిళపై ఒక్కసారిగా కోతులు దాడి చేశాయన్నారు. ఈ దాడిలో మహిళా మృతి చెందిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై కోతులు దాడి చేశాయి. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడగా మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు రైతువేదిక క్లస్టర్ ఏఈవో కళ్యాణ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల ఆయన ముగ్గురు రైతుల బీమా డబ్బులు తన ఖాతాలోకి మళ్లించి మోసం చేశాడని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా నేరం రుజువైంది. ఈ క్రమంలో ఏఈవోను విధుల నుంచి తొలగిస్తున్నట్టు గురువారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి వెల్లడించారు.
RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: పశ్చిమగోదావరి జిల్లాలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తులసి అనే మహిళకు ఎలక్ట్రిక్ సామాగ్రి అంటూ దుండగుడు పార్శిల్ తీసుకొచ్చాడు. పార్శిల్ బాక్స్‌లో కుళ్లినస్థితిలో ఏ వ్యక్తి మృతదేహం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. ఉండి మండలంలోని యండగండిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
HYD: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. మోండా మార్కెట్‌లో సంఘటన జరిగిన 24 గంటల్లో మహంకాళి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న పాన్ షాప్‌లో మంటలు చెలరేగాయి. స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షాప్‌లో దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తించారు.
MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం నుంచి బ్లాక్ లోనికి వచ్చే మెన్ సర్వీస్ వైర్లు అంటుకోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాలనీలో ఉన్న 12వ బ్లాకులో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మంటలు చెలరేగి పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునే గదికి వెళ్లగా సీలింగ్‌లో మొబైల్ ఫోన్ కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే తన భర్తకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో మహిళకు సంబంధించిన వీడియోలు కూడా ఆ ఫోన్‌లో రికార్డు చేసినట్లు గుర్తించిన పోలీసులు ని...