NLR: కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామ శివారులో కోడిపందాలు స్థావరాలపై రూరల్ సీఐ రాజేశ్వరరావు అదేశాల తో ఎస్సై తిరుమలరెడ్డి తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.5600 నగదు, 3 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని రూరల్ పోలీసులు తెలిపారు.