WNP: నాగవరం శివారులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో సభావత్ మన్యం (55) మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేష్ తెలిపారు.