• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలు మృతి

WGL: చెన్నారావుపేట మండలం అక్కలచెడ గ్రామానికి చెందిన మంకు శశిరేఖ అనే వృద్ధురాలు శనివారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 23, 2025 / 11:49 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం..సర్పంచ్ మృతి

E.G: దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 23, 2025 / 11:10 AM IST

ధర్మస్థల కేసులో ముసుగు వ్యక్తి అరెస్ట్

కర్ణాటకలోని ధర్మస్థల వ్యవహారం ఇటీవల జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పుడు సమాచారంతో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన భీమా అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

August 23, 2025 / 10:51 AM IST

వీధి కుక్కల దాడి.. 20 మేకలు మృత్యువాత

VKB: వీధి కుక్కల దాడిలో 20 మేకలు మృత్యువాత పడ్డాయి. జిల్లా కేంద్రంలోని మహావీర్ ఆస్పత్రి సమీపంలో 20 మేకలపై కుక్కలు దాడి చేసి చంపేశాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి మేకలపై దాడి చేసి చంపేయడమే కాకుండా ప్రజలపై కూడా దాడి చేసి గాయాలపాలు చేస్తున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

August 23, 2025 / 10:47 AM IST

రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని దిద్వానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జశ్వంత్ రోడ్డులో ఒక కారు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 23, 2025 / 09:46 AM IST

పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

E.G: గోపాలపురం మండలం వాదాలకుంటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో  పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 50,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడి పందేలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

August 23, 2025 / 09:42 AM IST

విషాదం.. కుటుంబంలో వరుస ఆత్మహత్యలు.!

సత్యసాయి: గోరంట్ల పట్టణంలోని ఎండాల బండ వీధిలో భక్సం అంజనప్ప అనే వ్యక్తి ఉరేవేసుకుని మృతి చెందాడని సీఐ బోయ శేఖర్ తెలిపారు. కొన్నినెలల క్రితం అంజనప్ప కుమారుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, ఆ బాధ తట్టుకోలేని భార్య విషద్రావణం తాగి మరణించింది. తాజాగా అంజనప్ప కూడా ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.

August 23, 2025 / 08:12 AM IST

బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

నయాగరా నుంచి న్యూయార్క్ వెళ్తున్న టూరిస్టు బస్సు బోల్తా పడి ఐదుగురికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 23, 2025 / 06:44 AM IST

పేపర్ మిల్లులో ప్రమాదం.. ఒకరు మృతి

SKLM: నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం మిల్లులో ఒక్కసారిగా కొన్ని టన్నుల ఊక తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కార్మికుడు ఉంగటి వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల కాలంలో కొన్ని ప్రమాదాలు మిల్లులో జరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు.

August 22, 2025 / 10:53 PM IST

చెరువులో యువకుడి మృతదేహం కలకలం

HYD: శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికి తీశారు. మృతుడు రసూల్ (25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నాడు.

August 22, 2025 / 07:31 PM IST

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

GNTR: పొన్నూరులో నిడుబ్రోలు ఫైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిడుబ్రోలు వైపుకు వెళ్తున్న ట్రాక్టర్‌ను పొన్నూరుకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రక్కు, ఇంజన్ రెండు భాగాలుగా విడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

August 22, 2025 / 07:26 PM IST

వత్సవాయిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

NTR: వత్సవాయిలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. బావి వద్ద గడ్డి చెదిరిన ఆనవాళ్లు, మద్యం సీసాలు దొరకగా, పెనుగులాట జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడలో నల్లపూసల దండ ఆధారంగా ముస్లిం మహిళగా స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

August 22, 2025 / 07:25 PM IST

ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి

E.G: గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో శుక్రవారం వెళ్లిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు కూలీలు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

August 22, 2025 / 07:08 PM IST

బాలిక హత్య కేసు.. నిందితుడు పదో తరగతి విద్యార్థి?

TG: కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక దారుణ హత్య వెనుక మిస్టరీ వీడింది. బాలికను పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలున్నాయి.

August 22, 2025 / 06:40 PM IST

కారు బైకు ఢీ.. వ్యక్తి మృతి

MHBD: గార్ల మండల కేంద్రంలని తిర్జాపురం స్టేజి వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బాదం సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 22, 2025 / 05:58 PM IST