• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

దారుణం.. చెరువులో తేలిన శిశువు

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోళ్లపడకల్ గ్రామ శివారులోని పత్తే సాగర్ చెరువు అలుగు వద్ద గుర్తు తెలియని శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

August 24, 2025 / 02:30 PM IST

జిల్లాలో ఆన్‌లైన్ గోల్డ్ బిడ్డింగ్ పేరుతో భారీ మోసం

ATP: అనంతపురం జిల్లాలో ఆన్‌లైన్ గోల్డ్ బిడ్డింగ్ పేరుతో భారీ మోసం బయటపడింది. దుండగులు బాధితుల నుంచి రూ. 35 లక్షలు కాజేశారు. మోసపోయిన బాధితులు వజ్రకరూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

August 24, 2025 / 02:00 PM IST

అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

GDWL: అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన గద్వాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లాలోని గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందారు. మృతుడు గుల్‌బార్  వాసిగా గుర్తించారు. మరిన్ని వివరాలకు తిలియాల్సి ఉంది.

August 24, 2025 / 11:06 AM IST

ఆటోను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

NDL: మహానంది మండలం సీతారామపురం గ్రామ సమీపంలోని నంద్యాల – గాజులపల్లె జాతీయ రహదారి వద్ద ఆటోను లారీ ఢీ కొందని స్థానికులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలో ప్రయాణికులను ఎక్కించుకొని నంద్యాలకు వెళుతున్న సమయంలో గిద్దలూరు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

August 24, 2025 / 10:33 AM IST

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

AP: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమార్తె.. ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు మృతిచెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 24, 2025 / 10:09 AM IST

ట్రాక్టర్‌ను వెనక నుండి ఢీకొన్న బైక్

MLG: తాడ్వాయి మండలం వెంగళపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో వ్యవసాయ కూలీలను తీసుకెళ్తూ రోడ్డు పక్కన ఆగింది. ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ట్రాక్టర్‌ను వెనక నుండి ఢీ కొట్టాడు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

August 24, 2025 / 07:33 AM IST

బైకును ఢీకొన్న కారు.. ఒకరికి గాయాలు

MLG: తాడ్వాయి మండలం నార్లపూర్-మేడారం మధ్య శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నార్లపూర్ వైపు వస్తుండగా నార్లపూర్ నుంచి మేడారం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నరేష్ కు గాయాలు కాగా 188 వాహనంలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

August 24, 2025 / 06:03 AM IST

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యోహాన్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో విచారణలో తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు.

August 23, 2025 / 07:46 PM IST

రెండేళ్ల చిన్నారిపై కుక్క దాడి

NZB: నందిపేటలోని రాజ్ నగర్ దుబ్బ వడ్డెర కాలనీలో శనివారం రెండేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై కుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. తల, చెంప, భుజం వద్ద తీవ్రంగా కరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు కుక్కను కర్రతో తరిమారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

August 23, 2025 / 07:00 PM IST

‘బాలిక హత్య కేసును చేధించిన పోలీసులు’

TG: కూకట్‌పల్లిలో బాలిక హత్య కేసు వివరాలను సీపీ మహంతి, డీసీపీ సురేష్ వెల్లడించారు. ఈనెల 18న ఈ హత్య జరిగిందని, నిందితుడు కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించాడని తెలిపారు. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని నిందితుడు చెప్పాడని, కానీ అసలు డబ్బు గురించే అతను మాట్లాడడం లేదని పేర్కొన్నారు. బాలిక అడ్డుకోగా పారిపోయేందుకు ప్రయత్నించి హత్య చేశాడని చెప్పారు.

August 23, 2025 / 02:08 PM IST

కొత్త తరహా సైబర్‌ స్కామ్‌

ఇటీవల కొత్త తరహా సైబర్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు పెళ్లి కార్డుల పేరుతో వాట్సప్‌లో లింకులు పంపుతున్నారు. ‘మా పెళ్లికి రండి’ అనే మెసేజ్‌తో వచ్చిన లింక్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి క్లిక్ చేయగా, అతడి ఖాతా నుంచి దాదాపు రూ.2 లక్షలు మాయమయ్యాయి. దీంతో ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

August 23, 2025 / 01:55 PM IST

రౌడీషీటర్ శ్రీకాంత్‌ను విశాఖకు తరలింపు

AP: రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు జైలు నుంచి విశాఖ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయ నేతల అండతో, అరుణతో కలిసి దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు పాల్పడ్డట్లు గుర్తించారు. జైలులో ఉంటూనే నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నట్లు తెలిపారు. అతనితో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

August 23, 2025 / 12:36 PM IST

ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలు మృతి

WGL: చెన్నారావుపేట మండలం అక్కలచెడ గ్రామానికి చెందిన మంకు శశిరేఖ అనే వృద్ధురాలు శనివారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 23, 2025 / 11:49 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం..సర్పంచ్ మృతి

E.G: దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 23, 2025 / 11:10 AM IST

ధర్మస్థల కేసులో ముసుగు వ్యక్తి అరెస్ట్

కర్ణాటకలోని ధర్మస్థల వ్యవహారం ఇటీవల జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పుడు సమాచారంతో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన భీమా అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

August 23, 2025 / 10:51 AM IST