NLR: కావలి రూరల్ వెంకయ్య గారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. లారీ పూర్తిగా ద్వంసం అయ్యింది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు.
TG: హైదరాబాద్ నగర శివారులోని అత్తాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హాసన్‌నగర్‌లో మతిస్థిమితం లేని యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
PLD: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నబిడ్డ అని కూడా చూడకుండా కత్తెరతో దాడికి తెగబడ్డాడు. మాచర్ల రోప్‌వే కాలనీకి చెందిన గణేశ్ నిత్యం మద్యం తాగి గొడవపడేవాడు. ఆదివారం భార్యతో వాగ్వాదానికి దిగి, అడ్డువచ్చిన కుమారుడు అభిషేక్‌పై కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడి వీపు, చేతిపై తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.
TG: HYDలోని బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో 16 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఘటనలో నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధం కాగా.. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: నేవీ ఉద్యోగి రవీంద్ర తన స్నేహితురాలు మౌనికను దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖలో జరిగింది. భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఆమెను ఫ్లాట్‌కు పిలిచి.. చంపి, శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తనను డబ్బుల కోసం వేధించిందని, అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. అయితే యువతి తలభాగం కనిపించలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
AP: అనంతపురం జిల్లాలో మద్యానికి బానిసైన భర్త(హనుమంతు)ను.. భార్యే చంపి పాతి పెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో నిందితురాలు చూపిన చోట తవ్వకాలు జరిపారు. హనుమంతు మృతదేహాన్ని బయటకు తీసి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. అనంతరం అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
AP: సత్యసాయి జిల్లాలోని హంద్రీనావా కాలువలో తండ్రి, కుమారుడు గల్లంతు అయ్యారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి వద్ద ఈతకు వెళ్లి కనిపించకుండాపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టాగా తండ్రి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
సత్యసాయి: చిలమత్తూరు మండలం దేముకేతపల్లి వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటన నెలకొంది. ఈ ఘటనలో వాహనాలు ద్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచించారు.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం ఒక వింత ఘటన జరిగింది. భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న కోపంతో మహాలక్ష్మి అనే మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సత్యసాయి: నల్లచెరువు మండలం బందార్లపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువలో ప్రమాదవశాత్తు తండ్రికొడుకులు గల్లంతయ్యారు. తండ్రి రాము(40) మృతదేహం లభించగా, ఎనిమిదేళ్ల కుమారుడు చిన్నోడు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
AP: విశాఖ టౌన్ కొత్తరోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాత సామగ్రి గోదాములో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనాస్థలికి సమీపంలోనే పెట్రోల్ బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. టౌన్ కొత్తరోడ్డు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. మూడేళ్ల కూతురు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తల్లి శంకరకుమారి, చిన్నారి మౌనిక మృతి చెందారు. తండ్రి గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లో కల్తీ దందా రోజురోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పాడైన మటన్ అమ్ముతున్న ఓ షాప్‌పై గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూపీ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసం నిల్వచేసినట్లు గుర్తించారు. FSSAI అనుమతులు లేకుండా అక్రమంగా మాంసం విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. వేలాది కిలోల మాంసం, తలలు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
NTR: తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్ వద్ద జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు శనివారం దాడి చేశారు. SI-II రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో “కోతముక్క” జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,400 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూదానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.