GNTR: ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్డేన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.
SKLM: కోటబొమ్మాళి మండలం నరసింగుపల్లి గ్రామం సమీపంలో గురువారం జూద శిబిరంపై గురువారం పోలీసులు దాడిచేశారు. కోటబొమ్మాళి ఎస్ఐ వీ. సత్యనారాయణ వివరాల మేరకు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో మేరకు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారని తెలిపారు. రూ.2.21లక్షల నగదను స్వాదీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి ఓబుల నాయుడుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ఇరువురు యువకులు డివైడర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఓ యువకుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి సర్వీస్ రోడ్డు కిందకు పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో యువకుడికి చేతికి గాయం అయ్యింది.
HYD: బాలానగర్ పీఎస్ పరిధి గాంధీనగర్ చెత్తకుండీలో గురువారం పేలుడు సంభవించింది. దీంతో చెత్త క్లీన్ చేస్తున్న మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై క్లూస్ సేకరిస్తున్నారు.
KKD: ప్రేమ పేరుతో బాలికను మోసగించి వ్యభిచారంలోకి దింపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు ఇన్ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలు భరించలేని బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది’. అని తెలిపారు.
మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు(బుధవారం) ఇద్దరు ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వివేకానందనగర్‌లో కృష్ణ చైతన్య రెడ్డి(34), మహంకాళినగర్ శంషీగూడలో నవీన్(18) అనే ఇద్దరు మృతి చెందారు. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
BHPL: జాతీయ రహదారి 353(సీ)పై మహాదేవపూర్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కాటారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు, అతడి బంధువైన మరో వ్యక్తితో కలిసి సూరారం వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి మైలురాయికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ హత్య కేసులో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించి చెరువులో పడేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.
NZB: జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ELR: మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేసే షెడ్ అగ్ని ప్రమాదానికి గురి అయ్యింది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి ఆర్ఎస్‌లోని బాయ్స్ స్కూల్ సమీపంలో గోపి అనే భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 30 తులాల వెండి పట్టీలు, ఒక తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
GNTR: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన దారుణ ఘటన వేమూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఆంజనేయులు మండలంలోని జంపని గ్రామంలో ఈనెల 23వ తేదీన బంధువుల పెద్ద కర్మకు వచ్చాడు. అక్కడ అదే రోజు అర్ధరాత్రి కూతురు వరుసయ్యే మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ కథనం ప్రకారం ఆ గ్రామానికి చెందిన జి. పోచమ్మల్లు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామానులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ధాన్యం బస్తాలు కాలిపోయి రూ.మూడు లక్షల వరకు నష్టం వచ్చి ఉంటుందన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మనంతవాడి ప్రాంతంలోని డివిజన్ 1, 2, 36 ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు అమలులో కర్ఫ్యూ ఉండనున్నట్లు వెల్లడించారు.
E.G: బొమ్మూరుకు చెందిన పెనుమళ్ళ రమ్య స్మృతి(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చికిత్స కోసం వచ్చింది. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. పరిస్థితి విషమించడంతో KKD జీజీహెచ్‌లో చేర్చగా ఆదివారం మృతి చెందింది.