• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

BREAKING: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

AP: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలోని బుళ్లసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టింది. ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

December 21, 2024 / 06:49 AM IST

ఘర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

NGKL: చారకొండ మండలంలోని సారబండ తాండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై దేవరకొండ వైపు వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి ర్యాంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని (22) యువతికి తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు తెలిపారు.

December 21, 2024 / 06:35 AM IST

పిడుగురాళ్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

PLD: పిడుగురాళ్ల నుంచి దాచేపల్లికి బైక్‌పై వినోద్, వెంకటేశ్ అనే ఇద్దరు యువకులు వస్తుండగా బ్రాహ్మణపల్లి పరిధిలో శనివారం తెల్లవారుజామున అదుపుతప్పి రైలింగ్‌‌ను ఢీకొట్టి ఇద్దరు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోగా.. వెంకటేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

December 21, 2024 / 06:31 AM IST

బైకును ఢీకొన్న కారు.. తెగిపడిన వ్యక్తికాలు

KMM: ఎటపాక మండలం రాయనిపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు- బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న వ్యక్తి సగం కాలు తెగి రోడ్డుపై పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 21, 2024 / 04:35 AM IST

వదిలేసిన కారులో 52 కేజీల బంగారం!

వదిలేసి వెళ్లిన కారులో రూ.10కోట్ల నగదు, 52 కేజీల బంగారం దొరికన ఘటన మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో చోటు చేసుకుంది. అటవీ మార్గంలో భారీగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఇన్నోవా కారు మాజీ కానిస్టేబుల్‌ గౌరవ్ శర్మ అనే వ్యక్తిదని గుర్తించారు. బంగారం, డబ్బు కూడా అతనిదేనని అనుమానిస్తున్నారు.

December 21, 2024 / 03:20 AM IST

ప్రమాదంలో 12 మంది సైనికులకు గాయాలు

సిక్కిం సెక్టార్‌లోని జులుక్‌ ప్రాంతంలో సైనికులు  ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మంది సైనికులు గాయాలపాలయ్యారు. విషయం  తెలుసుకున్న  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌  వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. రెస్క్యూ ఆపరేషన్‌ లో భాగంగా తూర్పు ఎయిర్‌ కమాండ్‌ నుంచి చీతా హెలికాప్టర్లతో పాటు ఎంఐ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌ను అధికార...

December 20, 2024 / 07:38 PM IST

కారును ఢీకొన్న బైక్

BDK: టేకులపల్లి మండలంలోని తొమ్మిదవ మైల్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 07:32 PM IST

భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజి వద్ద కారు బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని‌ వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 07:06 PM IST

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

KMM: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజారాం వివరాలు ప్రకారం.. కారేపల్లి మండలం మధురానగర్ తండాలో వాంకుడోత్ లక్ష్మీ తన భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధురాలు లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ రాజారాం కేసు నమోదు చేశారు.

December 20, 2024 / 06:57 PM IST

ఒకరిపై ఒకరు కత్తులతో దాడి

RR: చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారి మోహన్‌నగర్‌లోని ఏయూ బ్యాంక్‌లోకి చొరబడి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 20, 2024 / 06:19 PM IST

రంగాపురంలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం

E.G: బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన నక్క వెంకటరావు, లక్ష్మి దంపతుల పూరిపాక అగ్నికి పూర్తిగా ఆహుతైంది. ప్రమాదంతో బాధితుల సర్వం కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

December 20, 2024 / 04:30 PM IST

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసాని పేట్‌కు చెందిన అలీనా అనే విద్యార్థిని జాండీస్‌తో శుక్రవారం మృతి చెందింది. అలీనా కామారెడ్డి మైనార్టీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు తండ్రి రఫీక్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం విద్యార్థినికి జాండీస్ సోకడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు సమాచారం.

December 20, 2024 / 04:26 PM IST

ఆర్టీసీ బస్‌ ఢీకొని ఒకరి మృతి

HYD: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండి మైసమ్మ చౌరస్తా సమీపంలో 70 ఏళ్ల వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 03:48 PM IST

ఒంటిమిట్ట చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం

KDP: ఒంటిమిట్ట చెరువు కట్టపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు, కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన వీఎస్ ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి కారు చెరువు కట్ట పైకి రాగానే బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

December 20, 2024 / 02:01 PM IST

భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన భర్త

తమిళనాడులోని కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి భర్త చంపేశాడు. బ్యాగ్‌లో శరీర భాగాలు తీసుకెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. అనుమానంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో బ్యాగ్‌లో మటన్ తీసుకెళ్తున్నట్లు బుకాయించేందుకు ప్రయత్నించాడు. బ్యాగ్ లాక్కొని తెరిచి చూడగా మహిళ శరీర భాగాలు కనిపించాయి. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ...

December 20, 2024 / 12:58 PM IST