WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపూర్ మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకడి గిరి (45) ఆదివారం ఉదయం చేపల వేటకు రిజర్వాయర్లోకి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.