• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం: ప్రయాణికులు

NLG: మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందిన ప్రయాణికులు తెలిపారు. తెల్లవారుజామున ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లిందని చెప్పారు. ప్రమాదం జరిగాక డ్రైవర్ పరారయ్యారని తెలిపారు. కాగా ఆ బస్సు 55 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 10 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

December 20, 2024 / 12:29 PM IST

చెట్టుకి ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

SKLM: పలాస మండలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 20, 2024 / 11:25 AM IST

కోతుల దాడిలో మహిళ మృతి

MHBD: కోతుల దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడ మండల సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో బైక్‌పై వెళ్తుండగా మహిళపై ఒక్కసారిగా కోతులు దాడి చేశాయన్నారు. ఈ దాడిలో మహిళా మృతి చెందిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 11:11 AM IST

బైక్‌పై వెళ్తుండగా కోతుల దాడి.. మహిళ మృతి

MHBD: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని గాదే వాగు అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై కోతులు దాడి చేశాయి. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడగా మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 11:07 AM IST

కురవి ఏఈఓ సస్పెండ్

MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు రైతువేదిక క్లస్టర్ ఏఈవో కళ్యాణ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల ఆయన ముగ్గురు రైతుల బీమా డబ్బులు తన ఖాతాలోకి మళ్లించి మోసం చేశాడని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా నేరం రుజువైంది. ఈ క్రమంలో ఏఈవోను విధుల నుంచి తొలగిస్తున్నట్టు గురువారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి వెల్లడించారు.

December 20, 2024 / 11:06 AM IST

ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 10:34 AM IST

ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

RR: రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 10:34 AM IST

పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం

AP: పశ్చిమగోదావరి జిల్లాలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తులసి అనే మహిళకు ఎలక్ట్రిక్ సామాగ్రి అంటూ దుండగుడు పార్శిల్ తీసుకొచ్చాడు. పార్శిల్ బాక్స్‌లో కుళ్లినస్థితిలో ఏ వ్యక్తి మృతదేహం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. ఉండి మండలంలోని యండగండిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

December 20, 2024 / 10:11 AM IST

దేవుడికి దీపం పెట్టి వెళ్లారు.. వచ్చి చూసేసరికి

HYD: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. మోండా మార్కెట్‌లో సంఘటన జరిగిన 24 గంటల్లో మహంకాళి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న పాన్ షాప్‌లో మంటలు చెలరేగాయి. స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షాప్‌లో దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తించారు.

December 20, 2024 / 09:52 AM IST

కేసీఆర్ కాలనీలో అగ్నిప్రమాదం

MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం నుంచి బ్లాక్ లోనికి వచ్చే మెన్ సర్వీస్ వైర్లు అంటుకోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాలనీలో ఉన్న 12వ బ్లాకులో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మంటలు చెలరేగి పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.

December 20, 2024 / 09:42 AM IST

వైద్య పరీక్షల గదిలో రహస్య కెమెరా.. షాకైన మహిళ

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునే గదికి వెళ్లగా సీలింగ్‌లో మొబైల్ ఫోన్ కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే తన భర్తకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో మహిళకు సంబంధించిన వీడియోలు కూడా ఆ ఫోన్‌లో రికార్డు చేసినట్లు గుర్తించిన పోలీసులు ని...

December 20, 2024 / 09:39 AM IST

బైక్ ఢీ కొని వ్యక్తి మృతి

ELR: ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ షాజహాన్ (47) తన ఇంటి వైపుకు వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా షాజహాన్ మృతి చెందాడు.

December 20, 2024 / 08:51 AM IST

పట్టాలు తప్పిన రైలు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొర్రాగుహలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కొత్తవలస-కిరణ్ డోలు మార్గంలోని ప్యాసింజర్ రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 07:19 AM IST

నంద్యాలలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న కుందూ మొరుసు

నంద్యాలలో అక్రమంగా కుందూ మొరుసును తరలిస్తున్నారు. అక్రమార్కులకు కుందూ మొరుసు కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రివరకు కుందూలో యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారని పీవీ నగర్ వాసులు తెలిపారు. రోజు 20 ట్రాక్టర్లలో మొరుసు తోలుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ మొరుసు ధర రూ.1,600 నుంచి రూ.2,000 వేల వరకు అమ్ముతున్నారు.

December 20, 2024 / 07:16 AM IST

హోటల్‌లో పేలిన సిలిండర్‌లు

కృష్ణా: విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి జాతీయ రహదారి వెంబడి ఓ కారులో షోరూం పక్కన హోటల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్స్ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు, నివాసాలలో జనాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 06:34 AM IST