• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

అశోక్ నగర్‌లో గ్రూప్-2 అభ్యర్థి సురేఖ ఆత్మహత్య

HYD: అశోక్ నగర్‌లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి (D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్‌మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

December 24, 2024 / 11:48 AM IST

తాండూర్‌ సబ్‌ కలెక్టరేట్‌లో ఏసీబీ విచారణ

TG: వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌ సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏసీబీ విచారణ జరుపుతోంది. సోమవారం సాయంత్రం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏవో దానయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. దుద్యాలలో భూమి పట్టా కోసం అధికారులు లంచం డిమాండ్‌ చేశారు. లంచం తీసుకున్న కేసులో ఏవో దానయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ మాణిక్‌రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

December 24, 2024 / 10:57 AM IST

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యాయత్నం

KDP: కోడూరు రైల్వేస్టేషన్లో సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుడు సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. రాత్రి 11 గంటల సమయంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా తలకు గాయాలయ్యాయని రైల్వే పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు పంపామని తెలిపారు.

December 24, 2024 / 10:47 AM IST

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

KNR: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. కొయ్యడ మొగిలి ఈరోజు ఉదయం వ్యవసాయ పనుల కోసం బావిలో మోటర్ సరి చేస్తుండగా బెల్ట్ జారి బావిలో పడి మృతి చెందాడు. అటుగా వెళ్లిన తోటి రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతుడిని బయటికి తీశారు.

December 24, 2024 / 09:54 AM IST

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం

CTR: కడుపు నొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన రైతు రమేశ్ భార్య భారతి (30)కి సోమవారం రాత్రి కడుపునొప్పి అధికంగా వచ్చింది. నొప్పి తాళలేక విషం తాగింది. కుటుంబీకులు బాధితురాలిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది.

December 24, 2024 / 09:40 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: సీఐ

GNTR: తాడికొండ(M) లాంగ్రామ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికొండ సీఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి మండలానికి చెందిన ఏసుబాబు(45) లాం గ్రామం వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 24, 2024 / 09:38 AM IST

పుంగనూరులో అగ్నిప్రమాదం

CTR: పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో ఉన్న ఓ బేకరీలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి.. మంటలను నియంత్రించారు. ప్రమాదంలో బేకరీలోని వస్తువులు అగ్నికి కాలిపోవడంతో సుమారు రూ.5లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

December 24, 2024 / 08:01 AM IST

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

KMR: రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని KMR జిల్లా నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టలు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్‌రెడ్డి బైక్‌పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో శివాని మృతి చెందింది.

December 24, 2024 / 07:52 AM IST

పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తూ చనిపోయింది!

HYD: రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై  నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది.

December 24, 2024 / 07:45 AM IST

రూ.15 లక్షల విలువ చేసే బంగారు స్వాధీనం

SS: హిందూపురం పట్టణ, రూరల్ పరిధిలో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడిన వారి నుంచి రూ.15 లక్షల విలువ చేసే బంగారు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురం DSP మహేశ్తో కలిసి SP చోరీ వివరాలను వెల్లడించారు. హిందూపురం ప్రాంతంలో తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నామనారు.

December 24, 2024 / 06:14 AM IST

తిరుపతిలో వ్యభిచారం.. ఒకరి అరెస్ట్

TPT: తిరుపతి నగరంలో మరోసారి వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని సత్యనారాయణపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఇద్దరు అమ్మాయిలతో కుమారి అనే మహిళ ఈ తంతు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుమారిని అరెస్ట్ చేసీ ఇద్దరు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేశారు.

December 24, 2024 / 06:00 AM IST

గడ్డి మందు తాగి యువకుడు మృతి

KMM: కూసుమంచి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నాయకన్ గూడెంకి చెందిన కాంచాని శ్రీను కుమారుడు గోపి శనివారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. అనంతరం మందు తాగినవిషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. వారు హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గోపి సోమవారం రాత్రి మృతి చెందాడని తెలిపారు.

December 24, 2024 / 05:20 AM IST

‘అనికేపల్లిలో వైసీపీ నేత భారీ భూకుంభకోణం’

NLR: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనికేపల్లి పంచాయతీలో రూ.20కోట్ల భారీ భూ కుంభకోణం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ విమర్శించారు. సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాకలి చెరువు కింద 20ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి రూ.20 కోట్లకు వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అమ్ముకున్నారన్నారు.

December 24, 2024 / 04:15 AM IST

బాత్రూంలో జారి కిందపడి వివోఏ మృతి

KDP: వేముల మండలం గొల్లల గూడూరు గ్రామంలో వివోఏగా పనిచేస్తున్న సాయి లక్ష్మీ సోమవారం ఉదయం మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు.. వీవోఏ సాయిలక్ష్మి సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో జారి కిందపడి తీవ్రంగా గాయపడింది. గాయపడిన సాయిలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

December 24, 2024 / 04:08 AM IST

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న కారు

ప్రకాశం: దోర్నాల సమీపంలోని శ్రీశైలం రోడ్డులో మల్లికార్జున్ నగర్ వద్ద ప్రవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులోని ఇద్దరికి గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 22, 2024 / 12:39 PM IST