CTR: బంగారుపాలెం మండలం తిమ్మాజీపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బంగారుపాలెం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు, ఓ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీద ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.