ప్రకాశం: దోర్నాల సమీపంలోని శ్రీశైలం రోడ్డులో మల్లికార్జున్ నగర్ వద్ద ప్రవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులోని ఇద్దరికి గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కళ్లకురిచిలో ఆస్తి కోసం ఓ కుటుంబం హత్యకు నకిలీబాబా కుట్రకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై విషప్రయోగం చేశాడు. తీర్థంలో విషం కలిపి ఇచ్చినట్లు సమాచారం. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అన్నమయ్య జిల్లా కాల్పుల ఘటనలో విషాదం చోటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడిన హనుమంతు అనే వ్యాపారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రమణ అనే మరో వ్యాపారి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రాయచోటి మండలంలోని మాధవరంలో పాత సామాన్ల వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
AP: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సృష్టించాయి. ముండ్లమూరు మండలంలో ఉదయం 10:40 గంటల సమయంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిన్న ఇదే సమయంలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. నిన్న రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: మద్దూరు మండల కేంద్రంలోని ఎచ్‌పీ గ్యాస్ గోదాములో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుండుమల్ గ్రామానికి చెందిన నారాయణ (35) అనే వ్యక్తి గోదాములో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సిలిండర్ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్ వద్ద కాకి వీధిలోని గోవింద్ ఇంటిలో శనివారం రాత్రి దొంగలు కత్తులతో హల్చల్ చేశారు. ఇంట్లోని బాలుడు, ఓ మహిళ కూరగాయల కత్తితో ప్రతిఘటించారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇంటి సభ్యుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. DSP వివేకానంద, సీఐ పైడిపు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 38 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీలో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వారంతా క్రిస్మస్ వేడుకలకు సొంతూళ్లకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి...
అన్నమయ్య: రాయచోటి మండలం మాధవరంలో కాల్పుల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మద్దెలకుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు జరపడంతో హనుమంతు అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం కడప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.
NLR: మర్రిపాడు మండలం డీసీపల్లి వద్ద రహదారిపై సోమశిల ఉత్తర కాలువ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సోమశిల ఉత్తర కాలువ మీదగా వస్తున్న ఓ ట్రాక్టర్ జాతీయ రహదారి మీదగా వెళ్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తితో పాటు మరో మహిళకు గాయాలు అయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని డీసీపల్లి టోల్ ప్లాజా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
పల్నాడు: దాచేపల్లి పట్టణంలోని అలంకార్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు గొర్రెల మందను ఢీకొట్టడంతో సుమారు 150 గొర్రెలు మృతిచెందాయని, గొర్రెల కాపరి మల్లేష్‌కి తీవ్రమైన గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ నుంచి దాచేపల్లి మండలం మాదినపాడుకు గొర్రెల మంద వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.
ASR: రాజవొమ్మంగి మండలంలోని లోతట్టు ప్రాంతం ముంజవరప్పాడు గ్రామంలో అడవి జంతువులను వేటాడి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అటవీ, పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి శనివారం పట్టుకున్నారు. గ్రామానికి సమీప అడవిలో ఓ ఇంట్లో లభించిన అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: విశాఖ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌కు వచ్చిన తిరునెల్వేలి-పురులియా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తెగిపడిన విద్యుత్ తీగలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్‌లో విద్యుత్ తీగల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్...
W.G: తణుకులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. శనివారం తణుకు హైవేలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెరవలి మండలం అన్నవరప్పాడుకి చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యం(45) మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మరణించింది.
AP: అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. పాత సామాన్ల వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తి నాటుతుపాకీతో కాల్పులు జరిపాడు. రాయచోటి మండలంలోని మాధవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు తీవ్రగాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.