MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.