WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.