కృష్ణా: ఆగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలో అనుమానం పెనుభూతమై భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కార్మికుడు లాము రమేశ్ తన భార్య మనీషా (27)ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. సోమవారం జరిగిన ఘటన మృతురాలి అన్న యేసురత్నం తెలుసుకొని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
NLR: సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ.. బద్వేల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108లో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.
కృష్ణా: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల అజయ్ మంగళవారం అర్ధరాత్రి బుడమేరు బస్టాండ్ వద్ద బైకుపై వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ స్నేహితులకు సమాచారం అందించి, ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్నేహితులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం బీహార్ యువకుడి హత్య జరిగింది. బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందిన దిల్ కుష్ కుమార్(18)గా స్థానికులు గుర్తించారు. గత కొంతకాలంగా తన సోదరుడు దూలచంద్ నగరానికి వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరితో గత కొంతకాలంగా నగరానికి చెందిన ఇద్దరు మేస్త్రిలతో గొడవ జరుగుతుంది. వారే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
NGKL: అచ్చంపేట పట్టణంలోని హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారి వై జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో బాణాల గ్రామానికి చెందిన నగేశ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
KMM: కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తల్లాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అలుగుల వెంకటేశ్వర్లు(35) స్థానిక వెంచర్లో కాంక్రీట్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పని ప్రదేశంలో 33 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: కారు ఢీకొని గాయపడిన యువకుడు మృతిచెందినట్లు తాలూకా సీఐ కళవెంకటరమణ తెలిపారు. మదనపల్లి మండలం, కొత్తవారిపల్లి పంచాయితీ, కాశీరావుపేట వద్ద ఉండే కంకర ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం బైక్‌ను కారు ఢీకొని ప్రవీణ్ కుమార్(20) తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులో చిక్సత పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
ELR: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి. 108లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుడు జంగారెడ్డిగూడెం అని తెలుస్తుంది. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే, GRP పోలీసులు అరెస్టు చేశారు. రోహన్ రాజు ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయి తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు శంకర్, పవర్, శరత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మణిపూర్‌లో భారీగా ఐఈడీలను పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భారత సైన్యం, మణిపూర్ పోలీసులు ఇంఫాల్ జిల్లాలోని మాపిథెల్ రిడ్జ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 21.5 కేజీల ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
గుజరాత్ పఠాన్‌లోని ఎర్రచందనం గోడాన్‌లపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలోనే భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన 155 దుంగలను స్వాధీనం చేసుకొని.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు. పని నిమిత్తం మామ ఇంటికి వెళ్లిన చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేసి కొట్టి మరణించేలా చేశాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMM: ఖానాపురంలో కొప్పెర వాణి హత్య కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వాణిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, బంగారం దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో భర్త లక్ష్మీనారాయణ వచ్చి చూడగా ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వాణి చిన్న కుమారుడు గోపినాథ్ ప్రమేయం ఉన్నట్లు స్థానికంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
KMM: అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని మనస్థాపంతో గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచిలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న షేక్. నాగుల్ మీరాను యాజమాన్యం అకారణంగా తొలగించింది. దీంతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
KMM: డోర్నకల్ కొత్తలింగాల రోడ్డుపై ప్రమాద ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరల ప్రకారం.. ఆటో- తుఫాన్ వాహనం డీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.