PPM: కురుపాం మండలంలోని కిచ్చాడ వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అతి వేగంతో వస్తున్న ఇద్దరు ద్విచక్రవాహనదారులు ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులుకు తీవ్ర గాయలయ్యాయి. ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
MLG: మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన పూజారి దివ్య (30) పురుగుల మందు తాగి హత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో భర్త గొడవపడి ఆదివారం పురుగుల మందు తాగిన దివ్య రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దివ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MDK: అయ్యప్ప గురుస్వాములు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ నుంచి వెళ్తుండగా నర్సాపూర్ అడవి ప్రారంభంలో ప్రమాదం జరిగింది. గురుస్వామి టి.పి హరిదాస్, శంకర్ వెళుతున్న కారుకు ప్రమాదం జరగ్గా గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే మెదక్ అయ్యప్ప స్వాములు సంఘటన స్థలానికి బయలుదేరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
యెమెన్ రాజధాని సనాలో ఇరాన్ మద్దతుగల హూతీల స్థావరాలపై అమెరికా మిలిటరీ దాడులు చేసింది. ఈ విషయాన్ని హూతీ మీడియా ధ్రువీకరించింది. హూతీలు కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను ఆధారంగా చేసుకొని ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ప్రయాణించే యూఎస్ నేవీ, వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ స్థావరాన్ని ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
RR: షాద్‌నగర్ పట్టణంలోని కేశంపేట రోడ్ బైపాస్ సమీపంలోని “లక్కీ వైన్స్” షాపులో అర్థరాత్రి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మంగళవారం బాధితుడు వైన్స్ యజమాని కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 12 గంటల సమయంలో వైన్ షాప్ వెనుక నుండి తలుపును గడ్డపారతో పగలగొట్టి లోపలికి వచ్చారని విలువైన లిక్కర్లను దొంగలించారని తెలిపారు.
కృష్ణా: ఉయ్యూరు టౌన్ స్టేషన్ కానిస్టేబుల్ శిరీష, రూరల్ స్టేషన్లో పనిచేసే సునీత మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ టూవీలర్‌పై గన్నవరం ఎయిర్‌పోర్టుకు డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా కారు ఢీకొట్టింది. గాయాలైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద ఇతియోస్ కారు ఫ్లాట్ ఫామ్ ఉన్న ఇడ్లీ బండిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంపై ట్రాఫిక్ సీఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కారు డ్రైవర్ మద్యం మత్తులో శివాలయం ప్రాంతం నుంచి అతి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిపారు. కారులో ఉన్న నలుగురు గాయాలతో బయటపడ్డారు.
పంజాబ్: అమృత్‌సర్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. PSలో ఎలాంటి పేలుడు, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇది తమ పనేనని జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్త...
కృష్ణా: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వృద్ధురాలిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: మచిలీపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని మంగళవారం ఉదయం ఓ వ్యక్తి దుర్మరణంచెందాడు. ఈడేపల్లిలోని శ్రీపాద ఫంక్షన్ హాలు వద్ద బైక్‌పై వెళుతున్న వ్యక్తిని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మృతుడు గొడుగుపేటకు చెందిన కుంభం వరప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
WLG: జిల్లా గీసుగొండ మండలంలోని ధర్మారం బస్టాండ్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నక్కలపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పసునూరి కుమార్ మృతిచెందాడు. మృతుడు ట్రాక్టర్‌లో ఇటుక లోడు వేసుకొని నర్సంపేట వెళ్తుండగా ధర్మారం వద్ద ఛాయ్ తాగడానికి ఆగాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
PLD: ఈపూరు మండలం బొడ్రపాలెం (బోడిశెంభునివారిపాలెం) వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్ధానికుల కథనం.. విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP: ఆగి ఉన్న బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.
కడప: సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి, కనుములోపల్లి సమీపం వద్ద మంగళవారం కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. నేకనాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కడప నుంచి తన గ్రామానికి రోడ్డు మార్గాన వస్తూ ఉండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: సత్తెనపల్లిలోని గడియార స్తంభం వద్ద సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సాయి శరణ్య జనరల్ స్టోర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ఇందులో రూ.40లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.