TG: ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో దారుణ హత్య జరిగింది. సలుగుపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసి యువతి సమ్మక్క (25)ను దారుణంగా హత్య చేశారు. ఆమెను ప్రియుడే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: హైదరాబాద్ గండిపేట చెరువులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నార్సింగి PS పరిధిలోని ఇస్తానా విల్లాస్ దగ్గర నీళ్లలో పడి ముగ్గురు మృతిచెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసులు మృతదేహాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. చేపలు పట్టేందుకు వచ్చి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: మానసిక స్థితితో బాధపడుతూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ త్రిమూర్తులు వివరాల మేరకు తలారి గ్రామానికి చెందిన చొప్ప నందు(19) స్థానిక ఐటీఐ చదువుతున్నాడు. ఈ నెల 12 సాయంత్రం బయటకు వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. శివాలయం వద్ద గడ్డిమందు తాగాడు. విశాఖ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
SKLM: బూర్జ మండలం ఉప్పిని వలస గ్రామానికి చెందిన కపీరు జీవన్ కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఉప్పిని వలస నుంచి వస్తుండగా సింగన్న పాలెం కూడలి వద్ద టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: హైదరాబాద్ గోల్కొండ రిసాలబజార్‌లో దారుణం జరిగింది. 14 నెలల శిశువును దిండుతో ఊపిరాడకుండా చేసి తల్లి గౌసియా బేగం చంపింది. అనంతరం తల్లి గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. దంపతుల మధ్య వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు.
AP: ఏలూరు జిల్లా దొరమామిడి డ్యామ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు తూ.గో.జిల్లా యదవోలుకు చెందిన రమణ, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. యదవోలు నుంచి గుబ్బలమంగమ్మ ఆలయాకి 10 మంది యువకులు వచ్చారు. తిరిగి వస్తుండగా డ్యామ్‌లో స్నానానికి దిగారు. ఈ క్రమంలో గల్లంతైన ఇద్దరి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
AP: విశాఖ గోపాలపట్నం చంద్రనగర్‌లో బాణాసంచా పేలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో బాణాసంచా నిల్వలు ఉన్నాయి. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెస్తున్నారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం జరిగింది. వలిగొండ మండలం అరూరు వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేసరపల్లి దగ్గర ఓ కానిస్టేబుల్ బైక్ ఆపడానికి ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ అనే యువకుడు మృతి చెందగా.. సోదరుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయి. పోలీసుల వల్లే ప్రణయ్ చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
TG: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోర్ఖా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు మృతిచెందారు. ప్రసిద్ధ మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి పోలుసులు వెల్లడించారు.
AP: విజయనగరం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. బొండపల్లి మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ బొలేరోలో 650 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బొలేరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గంజాయి సీజ్ చేశారు. ఒడిశా నుంచి విజయనగరానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సత్యసాయి: జిల్లా మహమ్మదాబాద్ సమీపంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో చౌడమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. అమడగూరు మండలం తనకంటివారిపల్లికి చెందిన చౌడమ్మ కూరగాయల వ్యాపారం కోసం గోరంట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
AP: విశాఖపట్నంలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక బీహెచ్‌పీవీ కూడలిలో రెండు కార్లు, మూడు బైకులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక నలుగురు మృతిచెందారు. మృతుల్లో వృద్ధుడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బైక్ సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్‌లో ఉంచడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇంట్లో బైక్ ఉంచిన గదిలోనే అందరూ నిద్రించడంతో విషాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.