• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రాజమండ్రిలో రెండు ఇసుక లారీలు సీజ్

తూర్పు గోదావరి జిల్లాలో నియమాలను ఉల్లంఘించి అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించామన్నారు. కేసులు నమోదు చేసి రూ. 1,74,000 అపరాధ రుసుం విధించి వసూలు చేస్తామన్నారు.

March 8, 2026 / 06:32 AM IST

9 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుడు పరార్

నెల్లూరు నుంచి గూడూరు మధ్య రామేశ్వరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జనరల్ బోగీలోని ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తెరిచి పరిశీలించారు. అందులో 9 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి నిందితుడు పరారయ్యాడని రైల్వే డీఎస్సీ మురళీధర్ తెలిపారు.

March 8, 2026 / 06:22 AM IST

చిన్నారుల మిస్సింగ్ కేసు.. ముగ్గురు మృతి

AP: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా.. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 7, 2026 / 09:59 PM IST

ఐదుగురు చిన్నారుల అదృశ్యం

TG: కామారెడ్డిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(09).. ఇవాళ RBనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండాపోయారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితో కలిసి ఆటోలో ముగ్గురు చిన్నారులు వెళ్లారు. పిల్లలను షాపు వద్ద దింపేసి కిరాయికి వెళ్లానని పిల్లల తండ్రి చెబుతున్నాడు. PSలో చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

March 7, 2026 / 08:48 PM IST

ఆవును చంపేసిన పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

AP: పోలవరం జిల్లా అడ్డతీగల మండలం కృష్ణవరంలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. గంగవరం మండలం ట్యాంకుబీడు నుంచి రాత్రి కృష్ణవరం చేరుకున్న పులి.. ఆవు, దూడలపై దాడి చేసి చంపేసింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఓ ఆవుపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఇప్పటికే ట్యాంకుబీడు నుంచి బోనులు తరలించి, పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.

March 7, 2026 / 02:47 PM IST

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల మధ్య విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను NCB అధికారులు ఛేదించారు. తమిళనాడు తూత్తుకుడిలో 78 కిలోల హ్యాష్ ఆయిల్, తెలంగాణ రాయికల్ వద్ద 2 కిలోల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో శ్రీలంక జాతీయుడితో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

March 7, 2026 / 12:27 PM IST

విజయవాడలో కాల్పుల కలకలం

AP: డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ‘వజ్ర ప్రహార్’ పేరిట ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలో అధికారులపై కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 11:19 AM IST

విషాదం.. పాము కాటుతో వ్యక్తి మృతి

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన గూడెల్లి నారాయణ (52) మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పని చేస్తున్న ప్రదేశంలో పాము కాటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

March 7, 2026 / 11:00 AM IST

రాంపూర్ డంపింగ్ యార్డ్‌లో చెలరేగిన మంటలు

హనుమకొండ నగరంలోని రాంపూర్ డంప్ యార్డ్‌లో శుక్రవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న బల్దియా డీఆర్ఎఫ్, శానిటేషన్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకున్నారు. వాటర్ ట్యాంకర్లు, సంప్‌ల ద్వారా నీటిని స్ప్రే చేసి, బయో ఎర్తింగ్ మెటీరియల్‌ను పొరలుగా మార్చి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

March 7, 2026 / 09:30 AM IST

రోడ్డు రోడ్డు ప్రమాదం.. యువకుల మృతి

KMM: సత్తుపల్లి మండలం సదాశివునిపేట శివాలయం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టారు. దీంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(18), గంధం కార్తీక్ (20)గా గుర్తించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 09:00 AM IST

అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు

MDK: అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలకొంది. రామాయంపేటకు చెందిన గాయంతి మల్లేశం(45) బందువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అనంతరం స్థానిక కొత్తచెరువులో స్నానం చేసేందుకు దిగారు. ప్రమాదవశాత్తు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

March 7, 2026 / 08:39 AM IST

లారీ ఢీకొని కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామచందర్, మరొక హెడ్ కానిస్టేబుల్ బజ్జలాల్ గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పట్టణ శివారులో లారీ ఢీకొనడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

March 7, 2026 / 07:42 AM IST

షార్ట్ సర్క్యూట్‌.. దగ్ధమైన పాలకేంద్రం

MDK: రామాయంపేటలో గాంధీ రోడ్డు దగ్గర ఉన్న పాలకేంద్రంలో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు. పాలకేంద్రంలో ఫర్నిచర్, రెండు ఫ్రిజ్‌లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1,50,000 నష్టం జరిగినట్లు తెలిపారు.

March 7, 2026 / 07:21 AM IST

డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి

SDPT: పట్టణంలోని నాగదేవత ఆలయ సమీపంలో డివైడర్‌ను ఢీకొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు దుబ్బాకకు చెందిన మాడబోయిన రాంచరణ్ గా గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

March 7, 2026 / 04:51 AM IST

దారుణం: చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్

AP: విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోశారు. అనంతరం బాత్‌రూమ్‌లో పడిపోయిందని పేరెంట్స్‌కి ఫోన్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 6, 2026 / 06:43 PM IST