KMR: కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి నల్లకుంట మైసమ్మ ఆలయం వద్ద గురువారం గుర్తు తెలియని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.