RR: మొంథా తుఫాన్ కారణంగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. తుఫాన్ కారణంగా బాటసింగారం పెద్దవాగు ఉధృత రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు భర్తను రక్షించగా మహిళ మృతి చెందింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.