• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడి మృతి

WGL: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాచర్ల సారయ్య (57) హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ నేటి (సోమవారం) ఉదయం మృతి చెందాడు. అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స కోసం ఆయన ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఆయన నీటి సంఘం ఛైర్మన్, ఉప సర్పంచ్ పదవుల్లో పనిచేశారు.

December 16, 2024 / 01:14 PM IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం దక్షిణ చిరువోలులంక గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం(35) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

December 16, 2024 / 01:00 PM IST

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

MNCL: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో మేడి సాయికుమార్ (20) అనే యువకుడు సోమవారం మద్యం మత్తులో సంఘమిత్ర ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్ల రైల్వే పోలీసులు తెలిపారు.

December 16, 2024 / 12:39 PM IST

బీచ్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కృష్ణా: మచిలీపట్నం బీచ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనదారుడిని డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడికి కాలు విరిగింది. 108 వాహనంలో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 11:35 AM IST

అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి విశాఖపట్నంకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం, మినీ వ్యాన్ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.   

December 16, 2024 / 11:35 AM IST

చెరువులోకి దిగి బీఫార్మసీ విద్యార్థి మృతి

GNTR: జంగంగుంట్లపాలెం కేసీ రెడ్డి కళాశాలలో బీఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి మృతి చెందాడు. తెనాలికి చెందిన రంజిత్.. తాను ఉంటున్న హాస్టల్లో నీరు రాకపోవడంతో మేరికపూడి చెరువులోని మోటార్ బాగు చేయడానికి మెకానిక్‌తో కలిసి రంజిత్ దిగాడు. ఈక్రమంలో మట్టిలో కూరుకుపోయి రంజిత్ చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. 

December 16, 2024 / 11:17 AM IST

స్థంభానికి బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు

SRD: అందోల్ మండలోని అన్నాసాగర్ గ్రామం చౌరస్తా వద్ద స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరికీ గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పైజాబాద్‌కు చెందిన యువకులు ముగ్గురు బైక్‌పై వెళుతుండగా అన్నాసాగర్ స్మశానవాటిక ముందు బైక్ అదుపు తప్పి స్థంభానికి ఢీకొట్టింది. శ్రీకాంత్, బాబులు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

December 16, 2024 / 11:11 AM IST

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ ఇద్దరికి గాయాలు

HNK: కాజీపేట మండలం టేకులగూడెం ఔటర్ రింగ్ రోడ్డుపైన సోమవారం మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్ కాలు విరిగిపోయినది. ట్రాక్టర్ డ్రైవర్‌కి స్వల్ప గాయాలు, విషయం తెలుసుకున్న సీఐ కిషన్ సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

December 16, 2024 / 11:03 AM IST

అనంతపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం

W.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి విశాఖపట్నంకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అనంతపల్లి జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న మిని వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మినీ వ్యాన్ స్వల్పంగా దెబ్బతిన్నాయి.

December 16, 2024 / 10:58 AM IST

ఆటోను ఢీకొట్టిన కారు

W.G: నరసాపురం పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను కారు ఢీకొట్టింది. పాలకొల్లు నుంచి నరసాపురం వైపు వస్తున్న కారు నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది.

December 16, 2024 / 10:41 AM IST

రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

W.G: దెందులూరు మండలం కొమునేపల్లి హైవేపై బైక్‌ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముంగర పాండురంగారావు (62) మృతి చెందాడని SI శివాజీ తెలిపారు. మండవల్లి మండలం దెయ్యంపాడుకు చెందిన మృతుడు నిడమర్రు మండలం తోకలపల్లిలో బంధువు చనిపోవడంతో బైక్ పై బయలుదేరారు. సింగవరం పరిధిలో రహదారి దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

December 16, 2024 / 10:41 AM IST

హైవేపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురికిగాయాలు

JGL: సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ వద్ద జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 10:11 AM IST

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

NGKL: కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. జూబ్లిహిల్స్‌లో భరణి లేఅవుట్‌లో ఆయన ఇంట్లో ఏకంగా రూ.7.5 లక్షల ఎత్తుకెళ్లారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులకు జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన సమయంలో జైపాల్ యాదవ్ ఇంట్లో లేరని తెలుస్తోంది.

December 16, 2024 / 09:50 AM IST

హైవేపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురికి గాయాలు

SDPT: రిమ్మనగూడ వద్ద జాతీయ రహదారిపైఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 09:42 AM IST

మెంటాడలో అగ్నిప్రమాదం

VZM: సారాడవలస గ్రామంలో ఆదివారం సాయంత్రం వరి నూర్చే గల్లా మిషన్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. వరి పంట నూర్చుతున్న సమయంలో యంత్రం నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా ట్రాక్టర్‌తో పాటు వరి నూర్చే గల్లా మిషన్ మంటల్లో చిక్కుకుంది. సమీపంలో ఉన్న మూడున్నర ఎకరాల వరి పంట అగ్నికి ఆహుతయ్యిందని బాధితులు తెలిపారు.

December 16, 2024 / 09:09 AM IST