TG: HYD గుడిమల్కాపూర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో ఫిల్లర్ నం.111 వద్ద కార్ డెంటింగ్ కారాగారంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న సైన్ బోర్డు, వెల్డింగ్ కారాగారానికి వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లు రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.