లార్డ్స్ టెస్టులో నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175/6 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం క్రిస్ వోక్స్ (8), బెన్ స్టోక్స్ (27) క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ కీలకమైన రూట్, స్మిత్ వికెట్లు పడగొట్టాడు.