NLG: చిట్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగిని బిక్షంరెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. గౌరవాధ్యక్షులుగా జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆవుల మల్లేష్ యాదవ్, కోశాధికారిగా గురుజ జంగయ్య గౌడ్ ఎన్నికయ్యారని తెలిపారు.