BDK: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం ఇల్లందు పట్టణ కేంద్రంలోని చెరువు కట్ట వద్ద పెద్దమ్మతల్లి ఆలయంలో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో మాజీ MLA బానోతు హరిప్రియ నాయక్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. పెద్దమ్మ తల్లి వంటి దేవతలు ప్రజలకు ధైర్యం, శక్తి, భక్తి, ప్రేరణను అందిస్తారని అన్నారు.