కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందారు. హీరో ఆర్య- డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సార్పట్ట’ మూవీ సెట్స్‌లో కారుతో స్టంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని హీరో విశాల్ వెల్లడించారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్.. తాను నటించిన చాలా సినిమాల్లో సాహసవంతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు.