VZM: కంటకాపల్లి అలమండ రైల్వే స్టేషన్ పట్టాల మధ్య సుమారు 35-40 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ మృతదేహం గుర్తించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతురాలు ఎరుపు రంగు ఛాయతో ఉండి ఆకుపచ్చ పసుపు ఆరెంజ్ రంగుతో చారలు కలిగిన నైట్ గౌను ధరించినట్లు చెప్పారు. విశాఖ రైల్వే లైన్స్ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9490617089 సంప్రదించాలన్నారు.