SKLM: భగవంతుని నామస్మరణతోనే ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ప్రముఖ ప్రవచనకర్త ఇప్పిలి రామకృష్ణ శర్మ తెలిపారు. ఆదివారం పోలాకి మండలం బెలమర పాలవలస జంక్షన్ వద్ద ఉన్న చింతాడ పేట వద్ద శ్రీ స్వామి రామ యోగి ఆశ్రమంలో సత్సంగ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేదాలు కూడా నామస్మరణ చేపట్టాలనే తెలియజేస్తున్నాయని అన్నారు.