CTR: చిత్తూరులో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. చవటపల్లిలోని దుర్గమ్మ గుడి దేవస్థానం వద్ద ఆదివారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురికీ తరలించామన్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.