MBNR: కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడు మృతిచెందిన విషాదకర ఘటన మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయినపల్లికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ(3) ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో పడి మరణించాడు. ఆడుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.