NZB: నిబంధనలను పాటించని ట్రావెల్స్, స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. కర్నూలులో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బోధన్ పట్టణంలో నేడు ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిబంధనలు పాటించని ఓ స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.