VSP: లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.