VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.