KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్‌ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదారుల వద్ద రూ. 22,67,469 నమ్మించి మోసం చేశాడని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.