KKD: పెద్దాపురానికి చెందిన బ్యాండ్ కళాకారుడు ఆదినారాయణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం తుని వద్ద తేటగుంట వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. పెద్దాపురంలో బ్యాండ్ కళాకారుడిగా సుపరిచితుడైన అతని మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
KMR: మహరాష్ట్రకు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. బిక్కనూర్‌కు చెందిన మహిళ నుంచి బంగారు నగలను దొంగిలించిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిన అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 3 తులాల బంగారం, 2 కార్లు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
NZB: సిరికొండలో తాటిచెట్టుపై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అట్టిమల్ల శ్రీనివాస్ గౌడ్ గురువారం తాటిచెట్టుపై కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి కాలు విరిగింది. ఇంటికి పెద్ద దిక్కైన ఆయన కాలు విరగడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
KRNL: వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి 44 మార్గంలో ఈద్గా వద్ద గురువారం గ్యాస్ సిలిండర్ పేలి యేసు రాజు, సుకన్య దంపతులు గాయపడ్డారు. మొబైల్ క్యాంటీన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు, వంట చేస్తుండగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KMM: పెనుబల్లి మండలం వీఎం బంజరలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వెళుతున్న బైక్ ఢీకొంది ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NZB: బైక్ చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోచంపాడ్ గ్రామానికి చెందిన అఖిల్(26) తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ వెల్ఫేర్ వసతి గృహం సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ASF: ఆసిఫాబాద్ లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముకేష్ నాయక్ (30) ASFలోని శివకేశవ మందిర్ నగర్లో నివాసముంటున్నాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
W.G: దొడ్డిపట్లలో చేగొండి నాగవేణి అనే వృద్ధురాలు ఒంటరిగా జీవినం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఆమె ఇంటికి వెళ్లి దాడికి పాల్పడి, కత్తితో బెదిరించి నగలు ఇవ్వాలని అడిగాడు. ఆమె నిరాకరించడంతో మెడలో బంగారు గొలుసు లాక్కున్నాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బాలుడిని పట్టుకుని బుధవారం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశామని తెలిపారు.
HYD: మియాపూర్‌లో ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇక్కడ అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.
TG: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
W.G: మొగల్తూరు మండలం మోళ్ళపర్రు బీచ్ రోడ్డు వద్ద నిన్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనలకు ససంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మైదాన్గడిలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ ఇంటికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో 3 మృతదేహాలు కనిపించాయి. మృతులు ప్రేమ్ సింగ్, రజని, వారి కుమారుడు హృతిక్‌గా గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రేమ్ సింగ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
ADB: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న బుధవారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
BDK: భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ వద్ద గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
WNP: ఏదుల మండలం మాచుపల్లిలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. బొగ్గు రాములు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న కోడేరు మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పరిహారం ఇప్పించాలని ఆయన కోరారు.