VZM: జామి మండలం జడ్డేటివలసలో అత్తాకోడళ్ల మధ్య ఆస్తి తగాదా తలెత్తింది. బుధవారం ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ గొడవలో పెద్ద కోడలు విజయ కనకలక్ష్మి అత్త (గూనురు కొండమ్మ)ను బలంగా నెట్టింది. ఈ క్రమంలో కిందపడిన అత్త అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు గూనూరు రాంబాబు జామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.