కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురి మృతి చెందారు. మృతులంతా ఐదో తరగతి విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో చోటు చేసుకుంది. మృతులంతా అదే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నీటికుంటలో స్నానానికి దిగి వీరంతా చనిపోయారని గ్రామస్తులు తెలిపారు.